స్వీయ దర్శకత్వంలో బాక్సర్ గా వస్తున్న హీరో కార్తికేయ
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 21న కమ్‌బ్యాక్ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఆయన సతీమణి లోహితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది.