ఖమ్మంలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును ముమ్మరం చేసిన బీజేపీ నేతలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం రోటరీ నగర్ తొమ్మిదవ డివిజన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకదాని పుల్లారావు, రాష్ట్ర నాయకులు కుమిలి శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి పట్టభద్రులను కలిసి ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.