వృద్ధులపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కామారెడ్డి

మాచారెడ్డిలో ఎనభై ఎనిమిదేళ్ల వృద్ధురాలపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘటనతో పాటు పెద్దకొడపగల్ పరిధిలోని అంజనీలో అరెస్ట్ అయిన ఇద్దరు నిందితుల వ్యవహారంపై ఎస్పీ కామారెడ్డి స్పందించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఈ రెండు కేసులను పోలీసులు ఛేదించారని ఆయన తెలిపారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలతో పాటు ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.