తీవ్ర వాయుగుండం ముప్పుపై అమరావతిలో సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం ముప్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం, కవిటి ప్రాంతాల మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని, గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం జరగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.