హర్యానా సీఎం నివాసం ముట్టడికి కాంగ్రెస్ యత్నం, వాటర్ కెనాన్లతో చెల్లాచెదురు

రిపోర్టర్: శివ స్థలం: హర్యానా

హర్యానా కౌశల్ రోజ్‌గర్ నిగమ్ కార్మికుల క్రమబద్ధీకరణ డిమాండ్ చేస్తూ సీఎం నాయబ్ సింగ్ సైని నివాస ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆందోళనకారులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనను ఉధృతం చేశాయి.