వర్ధన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్ అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తన శ్రమను గుర్తించి వర్ధన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్ అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికీ దొమ్మటి రాజన్న గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి, మండల & టౌన్ పార్టీ అధ్యక్షులు పోశాల వెంకన్నకి, ఈగ దామోదర్ , మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సంక్షేమానికి, పీఏసీఎస్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.