జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు కేటీఆర్ ఆస్తి కాదు అంటూ ప్రదీప్ రెడ్డి స్పష్టీకరణ
రిపోర్టర్: మహేష్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని ఫామ్ హౌస్ వివాదంపై అసలు యజమాని ప్రదీప్ రెడ్డి స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ నేతల పర్యటన నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ప్రదీప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ నాలుగు ఎకరాల భూమి పూర్తిగా తన స్వార్జితమని, 2019లో అన్ని చట్టబద్ధమైన ప్రక్రియలతో కొనుగోలు చేశానని తెలిపారు. కేటీఆర్ తన చిన్ననాటి స్నేహితుడు కావడంతోనే ఆయనకు చట్టప్రకారంగా లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు.