పాలేరు వరద నీటిని చెరువులకు మళ్లిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడి
రిపోర్టర్: నరేష్
స్థలం: ఖమ్మం
ఎగువ ప్రాంతాల నుంచి పాలేరు జలాశయానికి వస్తున్న వరద నీటిని వృథా చేయకుండా ఖమ్మం జిల్లాలోని చెరువులకు మళ్లిస్తూ, సద్వినియోగం చేసుకునేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ వెల్లడించారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి నీటి మళ్లింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేస్తూ, వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నీటి వనరుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆయన స్పష్టం చేశారు.