గుర్గావ్‌లో బైకర్‌పై కారుతో దాడి, నిందితుల అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: Haryana
గుర్గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో కారుతో బైక్‌ను ఢీకొట్టి భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలో నిందితుడు కల్యాణ్ బైన్సలాను రాజస్థాన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు శివానీ చౌహాన్ ప్రయాణిస్తున్న బైక్‌ను నలుగురు యువకులు కారుతో వెంబడించి వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమె గాయపడగా, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.