తీరానికి ముప్పు: ఏపీలోని పదిహేను జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: విశాఖపట్నం

అర్నబ్ అతి తీవ్ర తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పదిహేను జిల్లాలకు భారత వాతావరణ సంస్థ ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసినట్లు ఏపీఎస్డీఎంఏ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం లోపు తీరం దాటే అవకాశం ఉండటంతో బాపట్ల, విశాఖ, కాకినాడ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరూ బయటకు రావద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.