ఆర్టీసీ పార్సిల్స్ లో పేలుడు పదార్థాలు: ప్రయాణికుల భద్రతపై అధికారుల నిఘా

రిపోర్టర్: వెంకట్ స్థలం: Vizianagaram

ఆర్టీసీ కార్గో సర్వీసుల్లో కొందరు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను బుక్ చేస్తున్నారని, తనిఖీల్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గతంలో ప్రమాదాలు జరిగాయని కార్గో సేవల అధికారి డి.ఎస్.ఎస్.ఎన్.రాజు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారని, నిషేధిత వస్తువులను తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీపావళిని పురస్కరించుకుని గోడ పత్రికలతో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.