పుత్తూరులో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సుజాత గెలుపునకు సీపీఎం జోరుగా ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పుత్తూరు

పుత్తూరు పట్టణంలోని ఇరవై నాల్గవ వార్డులో సిపిఎం అభ్యర్థి ఎస్ సుజాతను గెలిపించాలని కోరుతూ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ఎనిమిది రోజులుగా వీధుల్లో తిరిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ కాలువలు, రోడ్లు, వీధిలైట్ల సమస్యలను తీరుస్తామని తెలిపారు. పోలింగ్ రోజు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.