హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తేమతో కూడిన గాలుల కారణంగా వాతావరణంలో అస్థిరత ఏర్పడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. రానున్న గంటల్లోనూ ఆగ్నేయ, దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.