అమెరికాలో వైభవంగా దసరా దీపావళి ధమాకా వేడుకలు: హాజరైన ఎన్నారైలు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమెరికా
అమెరికాలోని ప్లీసంటన్ అలమేడా కౌంటీ ఫెయిర్గ్రౌండ్స్లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో దసరా దీపావళి ధమాకా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా ఎన్నారైలు హాజరయ్యారని పేర్కొన్నారు. మహా మంగళ హారతి, దుర్గామా రథయాత్ర, రామ్లీలా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. సుమారు నలభై అడుగుల భారీ రావణాసురుడి దిష్టిబొమ్మ దహనం ప్రధాన ఆకర్షణగా నిలిచిందని తెలిపారు.