రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై కూటమి ప్రభుత్వం దృష్టి
రిపోర్టర్: మహేష్
స్థలం: Andhra Pradesh
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కీలక సాగునీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోంది. రాయలసీమలో హంద్రీనీవా, ప్రకాశంలో వెలిగొండ, ఉత్తరాంధ్రలో పోలవరం ఎడమ కాలువ పనులను సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టింది. ఈ ప్రాజెక్టుల పూర్తితో ఆయా ప్రాంతాల్లో సాగునీటి కష్టాలు తీరి, వ్యవసాయ రంగం మరింత బలోపేతం కానుంది. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.