'తెలంగాణ ప్రజల పాలన దినోత్సవం': అమరులకు ఘన నివాళి

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

తెలంగాణ ప్రజల పాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గన్‌పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు అమరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ CMO అధికారికంగా నివాళులు అర్పించినట్లు వెల్లడించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయ సాధనే ధ్యేయంగా ప్రజా పాలన కొనసాగుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.