ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రకటన: ఇంగ్లాండ్ సిరీస్ కు కొత్త ఆటగాళ్లకు అవకాశం
రిపోర్టర్: శివ
స్థలం: సిడ్నీ
ఇంగ్లాండ్ తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా సెలెక్టర్లు పలువురు కొత్త యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ వెల్లడించారు. మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఈ జట్లలో మహ్లీ బ్యార్డ్ మన్, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ స్కాట్ లతో పాటు లాచ్ లాన్ షా, సామ్ హార్పర్ లకు అవకాశం దక్కిందని ఆయన తెలిపారు. వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.