బతుకమ్మ ఏర్పాట్లపై మున్సిపల్ అధికారుల ప్రత్యేక దృష్టి: నర్సంపేటలో పరిశీలన

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

బతుకమ్మ పండగను పురస్కరించుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. పదవ వార్డులోని పోచమ్మ ఆలయం వద్ద స్థలాన్ని మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, వైస్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ శ్రీధర్ పరిశీలించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, రహదారి, చెత్త తొలగింపు, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.