మంత్రి దామోదర రాజనర్సింహ వర్సెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు: గాంధీభవన్ కు పిలుపు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మధ్య చోటుచేసుకున్న విభేదాలు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీ పర్యటనలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ వివాదంపై టీపీసీసీ సీరియస్ అయింది. నష్టనివారణ చర్యల్ లో భాగంగా ఇరువురు నేతలను గాంధీభవన్ కు రావాల్సిందిగా ఆదేశించినట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి.