రంగారెడ్డి జిల్లాలో భారీ ఫేక్ కరెన్సీ గుట్టురట్టు: ఆరుగురి అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 6.78 కోట్ల భారీ ఫేక్ కరెన్సీ ముఠాను అరెస్ట్ చేసినట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియా సమావేశంలో తెలిపారు. హయత్ నగర్ లోని కుంట్లూర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని యూట్యూబ్ చూస్తూ ఫోటోషాప్ సాయంతో రూ. 500 నకిలీ నోట్లను ప్రింట్ చేసి పోలీసులుగా చెలామణి అవుతూ ఈ ముఠా దందాలు నిర్వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు.