ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని పిలుపు
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో ప్రయాణికులు మరియు వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించి, హెల్మెట్ మరియు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరి భద్రత తమ ప్రథమ ప్రాధాన్యమని పోలీసులు తెలిపారు.