తాతా మధు వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీరియస్

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. శాసనసభాపతిగా చట్టపరమైన చర్యలు తీసుకునే పూర్తి అధికారం తనకు ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని, మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు.