కాలనీలలో పరిశ్రమల దుర్గంధంపై స్పందించి అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే వివేకానంద్

రిపోర్టర్: నరేష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

నిజాంపేట్ సర్కిల్ బాచుపల్లి పరిధిలోని కావ్య రెవెన్యూ మరియు తన్వి హిల్స్ కాలనీలలో పరిశ్రమల నుండి వెలువడే దుర్గంధంతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు కె.పి. వివేకానంద - ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యపై తక్షణమే స్పందించిన ఆయన, కాలనీవాసులను ఇబ్బంది పెడుతున్న పరిశ్రమల తీరుపై అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు స్థానికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.