జంతర్ మంతర్ నిరసన ప్రదేశం రద్దుపై కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మండిపాటు

రిపోర్టర్: సునీల్ స్థలం: ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్కు నిరసన ప్రదేశం హోదాను రద్దు చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రస్థాయిలో మండిపడ్డారని సీజేపీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, దేశమంతా జంతర్ మంతర్గా మారుతుందని హెచ్చరించారు. నిరసనల గొంతు నొక్కడమే ప్రధాని మోదీ అసలు లక్ష్యమని, పిరికిపంద చర్యలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.