నగరిలో లబ్ధిదారులకు పీఎంఏవై పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలో పీఎంఏవై 2.0 పథకం కింద ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు స్వయంగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.