కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ కేశినేని చిన్ని
రిపోర్టర్: సునీల్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన కుమారుడు వెంకట్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను ఖండించారు. వెంకట్ మేయర్ రేసులో పోటీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాగానాలేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన కుమారుడు చదువు, వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారని, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.