నిరుద్యోగులపై కేసులు అన్యాయం: సీఎం చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్ జగన్
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
కాకినాడలో మెగా పోలీస్ నోటిఫికేషన్ కోసం నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని వైకాపా అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. బాబు జాబులేవి అని ప్రశ్నించడమే నేరమా అని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును నిలదీశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం, నిరుద్యోగులపై పెట్టిన బేషరతుగా ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.