విశాఖలో సంచలనం సృష్టించిన హత్య కేసు: అండమాన్లో నిందితుల అరెస్ట్
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం పరిధిలోని భీమిలిలో నాలుగేళ్ల క్రితం జరిగిన సంచలనాత్మక హత్య కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. భీమిలికి చెందిన పైడిరాజు 2022లో హత్యకు గురయ్యాడని, బాధితుడి భార్య జ్యోతి, ఆమె ప్రియుడు నూకరాజు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. పరారీలో ఉన్న నిందితులను అండమాన్ నికోబార్ దీవులలో అదుపులోకి తీసుకుని విశాఖపట్నానికి తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.