స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: వెంకటగిరి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.