నితారి కేసు నిందితుడు సురేందర్ కోలిది ఆత్మహత్యేనని తేల్చిన పోస్టుమార్టం
రిపోర్టర్: మహేష్
స్థలం: హరిద్వార్
సంచలన నితారి హత్యల కేసులో మాజీ నిందితుడు సురేందర్ కోలి మృతిపై పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో సురేందర్ కోలి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టంలో యాంటీ-మార్టం హ్యాంగింగ్ అని తేలడంతో ఆయన ఉరివేసుకునే సమయానికి ప్రాణాలతో ఉన్నట్లు స్పష్టమైంది. సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, సీసీటీవీ టేజ్ను పరిశీలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.