తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: గణాంకాలు వెల్లడించిన టీటీడీ ఛైర్మన్

రిపోర్టర్: విజయ్ స్థలం: తిరుమల

తిరుమలలో అక్టోబర్ 12 నుంచి 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఉత్సవాల విజయవంతంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఎనిమిది రోజుల్లో 6.46 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.25.79 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. రద్దీకి తగినట్లుగా 22.60 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశామని, 34.34 లక్షల లడ్డూలను విక్రయించామని ఆయన వెల్లడించారు.