విదేశీ సాయంతోనే ప్రధాని పదవి: నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ నిప్పులు
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
విదేశీ మద్దతుతోనే నరేంద్ర మోదీ ప్రధాని పదవిలో కొనసాగుతున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ కూడా విదేశీయుల నియంత్రణలోనే ఉందని మండిపడ్డారు. తన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపాలని ఆయన స్పష్టం చేశారు.