గోమాతను రక్షిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: Kolkata

సాధువులను అవమానిస్తే జైలుపాలు తప్పదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన భగవద్గీత పఠన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గోమాతను కాపాడే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. భగవద్గీతను, హనుమాన్ చాలీసాను ఎటువంటి భయం లేకుండా ప్రచారం చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతాచారాలను పాటించేవారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, దేశభక్తులు ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.