రామాయణం సినిమా షూటింగ్ అనుభవాలపై స్పందించిన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ముంబై

రామాయణం సినిమాలో ఇంద్రుడిగా నటిస్తున్న కునాల్ కపూర్ గ్రీన్ స్క్రీన్ పై మొదటిసారి భారీ యాక్షన్ సన్నివేశాల్ లో నటించడంపై తన అనుభవాలను పంచుకున్నారు. సినిమాలోని యాక్షన్ ఘట్టాల కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ టెర్రీ నోటరీ తమకు ఎంతో సహాయం చేశారని, ఆయన మార్గదర్శకత్వం నటులకు సులభతరమైందని కునాల్ కపూర్ పేర్కొన్నారు. ఊహల ఆధారంగా నటించడం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చిందని ఆయన తెలిపారు.