భారత ఆకృతిలో దీపాలు వెలిగించి మోదీ జన్మదిన వేడుకలు
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా అచ్యుతాపురం మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆశీర్వాద్ జ్యోతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠను పెంచుతున్న మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం వద్ద భారత ఆకృతిలో దీపాలు వెలిగించారు. అనంతరం మోదీజీ జై జై అంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజన సన్యాసి నాయుడు, మండల అధ్యక్షుడు కె. నాయుడుబాబు, కె. చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.