షాకింగ్ నిజం: వారాంతపు మద్యం సేవనంతో ముప్పు తప్పదని వైద్యుల హెచ్చరిక

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

వారాంతంలో మాత్రమే మద్యం సేవించడం వల్ల కాలేయం సురక్షితంగా ఉంటుందని భావించడం పొరపాటని అపోలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సురేశ్ రాఘవయ్య స్పష్టం చేశారు. ఒకేసారి అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయ కణాలు దెబ్బతింటాయని, ఎలాంటి లక్షణాలు లేకుండానే ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో సిర్రోసిస్ వంటి ప్రాణాంతక వ్యాతులకు దారితీస్తుందని వైద్య నిపుణులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.