ప్రేమపోరాటానికి సార్థకత: శ్రీకాంత్తో వివాహానికి అంగీకరించిన ప్రియుడు శ్రీదేవి

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

ప్రియుడు శ్రీకాంత్తో వివాహం కోరుతూ దళిత యువతి శ్రీదేవి చేపట్టిన నిరసన దీక్ష శుభముగింపునకు చేరింది. స్థానిక వర్ధన్నపేటలో మున్సిపల్ చైర్మన్ ఆంగోతు సారంగపాణి కుటుంబ సభ్యుల చొరవతో శ్రీకాంత్ వివాహానికి అంగీకరించడంతో శ్రీదేవి తన ఆందోళనను విరమించారు. అనంతరం ఇరు కుటుంబాలు, ప్రజాసంఘాల నాయకులు, స్థానికుల సమక్షంలో వారిద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు.