వృద్ధ దంపతులను దొంగలుగా ఆరోపించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా వ్యక్తి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Sydney
ఆస్ట్రేలియా దేశానికి చెందిన ట్రెంట్ కార్టర్ అనే వ్యక్తి వృద్ధ దంపతులను చూసి వారు వస్తువులను దొంగిలించారంటూ తీవ్రంగా ఆరోపించాడు. కేమార్ట్ స్టోర్ బయట కూర్చున్న ఆ వృద్ధుల వద్ద సెక్యూరిటీ ట్యాగ్ అలాగే ఉండటంతో వారిని దొంగలుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశాడు. అయితే ఆ వృద్ధులు డబ్బు చెల్లించి కొనుగోలు చేశారని, స్టోర్ సిబ్బంది ట్యాగ్ తొలగించడం మరచిపోయారని ప్రత్యక్ష సాక్షి స్పష్టం చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తిపై మండిపడ్డారు.