కాంగ్రెస్ పార్టీలోకి మాజీ సీఎం జగన్ రావాలని భట్టి ఆహ్వానం
రిపోర్టర్: నరేష్
స్థలం: కొచ్చి
కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన పాత నాయకులందరూ తిరిగి సొంతగూటికి రావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ, శరత్ పవార్ వంటి నేతలంతా మళ్లీ కాంగ్రెస్లోకి తిరిగొస్తే అత్యంత సంతోషించే వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాల అమలు కోసం వారంతా ఒకే వేదికపైకి రావాలని ఆకాంక్షించారు.