కల్వా చౌత్ వేడుకలపై సంచలన వ్యాఖ్యలు చేసిన దివిజా భాసిన్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
భర్తల కోసం మహిళలు మాత్రమే నిరాహార దీక్ష చేయడంపై ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ దివిజా భాసిన్ తీవ్ర విమర్శలు చేశారు. భార్య ఆకలితో అల్లాడుతుంటే భర్తలు ఎలా చూస్తూ ఉండగలరని ఆమె ప్రశ్నించారు. ఈ సాంప్రదాయం సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను చాటుతోందని, కేవలం భార్యలు మాత్రమే ఉపవాసాలు ఉండాలనే నిబంధన సరికాదని ఆన్లైన్ వేదికగా అభిప్రాయపడ్డారు.