సర్వేపల్లి నియోజకవర్గ పబ్లిక్ సిటీ వింగ్ అధ్యక్షుడిగా దాసరి మహేంద్ర వర్మ నియామకం
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలానికి చెందిన వైఎస్సార్సీపీ యువ నాయకుడు దాసరి మహేంద్ర వర్మ సర్వేపల్లి నియోజకవర్గ పబ్లిక్ సిటీ వింగ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రం, ఐడెంటిటీ కార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తన రాజకీయ గురువు కాకాని గోవర్ధన్ రెడ్డికి మహేంద్ర వర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.