విద్యుత్ మోటార్ వేస్తూ వ్యక్తి దుర్మరణం!
రిపోర్టర్: మహేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని జమ్మలపాలెం నుడా లేఔట్ సమీపంలో సిమెంట్ బ్రిక్స్ నిర్వహిస్తున్న షేక్ బషీర్ (74) శుక్రవారం ఉదయం నీళ్లు పట్టుకునేందుకు విద్యుత్ మోటార్ వేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న జలదంకి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.