ముంబైలో షాకింగ్ ఘటన: హీరో టైగర్ ష్రాఫ్పై కాల్పుల కలకలం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Mumbai

ముంబైలోని జూహూ ప్రాంతంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో హీరో ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఆయన డ్రైవర్తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన క్రైం బ్రాండ్ పోలీసులు, రాజస్థాన్లోని కోటాలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.