బద్వేల్ ఇన్చార్జి మంచూరును కలిసి సమస్యలు విన్నవించిన తెల్లపాడు నాయకులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కలసపాడు

వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండల పరిధిలోని తెల్లపాడు గ్రామ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మండల కమిటీ సభ్యుడు పామూరు బాల్రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో గ్రామంలో ఎదురవుతున్న పలు రకాల స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని ప్రతినిధి బృందం కోరగా, సానుకూలంగా స్పందించిన ఇన్చార్జి తగిన సహాయసహకారాలు తప్పకుండా అందిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.