తెలంగాణ విమోచన దినాన జాతీయ జెండా ఆవిష్కరణ
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గజరాజు కాశీనాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుమ్మల మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.