ఎన్నికలపై మాజీ సీఎం జగన్ సెటైర్లు: ఇవి ఎంపికలేనంటూ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశం లేకుండా చేసి ఎన్నికల్ లో గెలవవచ్చంటూ సీఎం చంద్రబాబు, పోలీసు, ఎస్ఈసీ బృందాలకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోలేదని, కేవలం ఎంపిక మాత్రమే చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇవి ఎన్నికలు కాదని, ఎంపికలు మాత్రమేనని ఎద్దేవా చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతోంది.