వీల్ఛైర్లలో బెడ్షీట్లు తరలిస్తుండటంతో రోగుల తీవ్ర ఇబ్బందులు

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

విజయనగరం మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వీల్ ఛైర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని రోగులకు కాకుండా బెడ్షీట్లు, ఇతర వస్తువుల తరలింపునకు వినియోగిస్తున్నట్లు వారు వాపోయారు. చిన్నపిల్లలను తల్లులే ఎత్తుకుని రావాల్సి వస్తోందని, వార్డుల నుంచి రోగులను తీసుకువచ్చేందుకు సిబ్బంది కూడా అందుబాటులో ఉండటంలేదని తెలిపారు. గోడలను పట్టుకుని నడవాల్సిన దుస్థితి నెలకొందని రోగులు ఆరోపించారు.