అమాయకంగా ఉంటే వన్ టైమ్ వండర్ అవుతారు: సీఎం రేవంత్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. లేదంటే రాజకీయాల్లో వన్ టైమ్ వండర్ అవుతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 22ఏ భూముల జాబితాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.