పాలకొండ కోట దుర్గమ్మ నవరాత్రుల్లో పోటెత్తిన రూ. 32 లక్షల ఆదాయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ద్వారా ముప్పై రెండు లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ వెల్లడించారు. కుంకుమార్చనలు మరియు హుండీ కానుకల ద్వారా ఈ మొత్తం వచ్చిందని, గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు.