పుంగనూరులో వైఎస్సార్సీపీకి భారీ షాక్: మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న కూటమి
రిపోర్టర్: మహేష్
స్థలం: పుంగనూరు
అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీని అధికార కూటమి కైవసం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి కనీస పోటీ కూడా లేకపోవడంతో కూటమి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం ముప్పై రెండు వార్డులు ఏకగ్రీమం కాగా, మున్సిపల్ చైర్ పర్సన్‌గా నయీమ్ తాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ఇతర పార్టీల మధ్య ఎన్నికలు జరిగాయని తెలిపారు.